కరోనాతో పోరులో మరణిస్తే కోటి రూపాయల పరిహారం

వైద్య సిబ్బందిలో మరింత ఉత్సాహం నింపేలా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రకటన చేశారు. కరోనా మహమ్మారితో పోరాటంలో ఒకవేళ ఎవరైనా వైద్య సిబ్బంది ప్రాణాలు కోల్పోతే వారి కుటుంబాలకు కోటి రూపాయలు ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. వారు ప్రభుత్వ లేదా పైవేట్ ఏ రంగం వారైనా ఈ మొత్తం అందజేస్తామని తెలిపారు. కోవిడ్‌-19పై పోరులో వారి సేవలు సైనికుల కంటే తక్కువేమీ కాదని కేజ్రీవాల్ కొనియాడారు.




  •