GST కారణంగా ధరల పెంపు అనంతరం రూ.20 వేలలోపు బెస్ట్ ఫోన్లు ఇవే!(ఏప్రిల్ 2020)

ఏప్రిల్ 1వ తేదీ నుంచి స్మార్ట్ ఫోన్లపై పెరిగిన జీఎస్టీ అమల్లోకి రావడంతో దాదాపు అన్ని స్మార్ట్ ఫోన్ల ధరలూ పెరిగాయి. దీంతో రూ.15 వేల లోపు ఉన్న కొన్ని ఫోన్లు రూ.20 వేలలోపు కేటగిరీలోకి వచ్చాయి. రూ.20 వేల లోపు ధరలో ఉన్న కొన్ని ఫోన్లు రూ.25 వేల కేటగిరీలోకి వెళ్లాయి.



సాధారణంగా మనదేశంలో ఎక్కువగా అమ్ముడుపోయే స్మార్ట్ ఫోన్లలో రూ.20 వేల లోపు స్మార్ట్ ఫోన్లు కూడా ఉన్నాయి. అయితే స్మార్ట్ ఫోన్లపై జీఎస్టీని పెంచుతూ కేంద్రప్రభుత్వం గతంలోనే నిర్ణయం తీసుకుంది. ఇది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. ఈ నిర్ణయంతో రూ.15 వేల లోపు ఉన్న కొన్ని ఫోన్లు రూ.20 వేలలోపు కేటగిరీలోకి వచ్చాయి. రూ.20 వేల లోపు ధరలో ఉన్న కొన్ని ఫోన్లు రూ.25 వేల కేటగిరీలోకి వెళ్లాయి. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న స్మార్ట్ ఫోన్లలో జీఎస్టీ అమల్లోకి వచ్చాక పెరిగిన ధరల ప్రకారం రూ.20 వేల లోపు టాప్-10 స్మార్ట్ ఫోన్లు ఇవే! ఇంతకుముందు వీటి ధరల ఎంతగా ఉండేది? ఇప్పుడు ఎంతగా ఉంది? రూ.15 వేలలోపు ధరలో ఉన్న ఫోన్లలో ఎన్ని ఫోన్లు ఈ కేటగిరిలోకి వచ్చాయో తెలుసుకోవడానికి కథనాన్ని పూర్తిగా చదవండి!