కరోనా వైరస్ విషయంలో చైనాపై గుర్రుగా ఉన్న దేశాల జాబితాలో ఆస్ట్రేలియా కూడా ఉంది. వైరస్ వ్యాప్తికి గల కారణాలపై స్వతంత్ర దర్యాప్తునకు ఆస్ట్రేలియా డిమాండ్ చేస్తోంది. ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆస్ట్రేలియాలో చైనా రాయబారి చెంగ్ జింగ్‌యూ మాట్లాడుతూ.. ఆస్ట్రేలియా ఉత్పత్తులు, యూనివర్సిటీలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. చైనా రాయబారి వ్యాఖ్యలపై ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి మైర్సే పేన్ మండిపడ్డారు. కరోనావైరస్ మహమ్మారిపై దర్యాప్తు కోసం ఆస్ట్రేలియా ముందుకు రావడంతో ఆర్థిక బలప్రయోగానికి చైనా ప్రయత్నిస్తోందని హెచ్చరించారు. గతవార
కరోనా వైరస్ మూలాలు, వ్యాప్తిపై స్వతంత్ర దర్యాప్తునకు మద్దతు ఇవ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్థలోని సభ్యదేశాలను గతవారం ఆస్ట్రేలియా పిలుపునిచ్చింది. అంతేకాదు, పలు ప్రపంచ నేతలతోనూ చర్చలు జరుపుతోంది. దీనిపై చైనా విదేశాంగ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఎదురుదాడి చేస్తోంది. ఆస్ట్రేలియన్ ఫైనాన్సియల్ రివ్యూ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెంగ్ వ్యాఖ్యలతో వివాదం తారాస్థాయికి చేరింది